»Vimanam A Movie That Connects Everyone Director K Raghavendra Rao
Vimanam Movie: అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ‘విమానం’: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా విమానం మూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైలర్‌ను సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు చూసి స్పందించారు.
చిన్నప్పుడు పిల్లల్లో ఓ మంచి ఎమోషన్‌ను నింపితే వాళ్లు పెద్దై ఏదైనా సాధించగలరని చెప్పటానికి ‘విమానం’ సినిమా(Vimanam Movie) ఒక ఉదాహరణ అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు(Director K. Raghavendra Rao) అన్నారు. తండ్రీకొడుకులు మధ్య భావోద్వేగం, లవ్ వంటి ఎమోషన్స్ కలయికగా ‘విమానం’ రూపొందిందన్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. తాజాగా ‘విమానం’ మూవీ ట్రైలర్‌ను సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు చూశారు.
డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు(Director K. Raghavendra Rao) మాట్లాడుతూ..‘విమానం’ సినిమా(Vimanam Movie) ట్రైలర్ చూశాను. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. చాలా మంచి ఎమోషన్స్‌తో సినిమా ఉంటుందని తెలిసింది. అలాగే దర్శకుడు శివ ప్రసాద్ తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ గురించి చెబుతుంటే బాగా టచింగ్‌గా అనిపించింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేయాలి. తల్లిదండ్రులు ‘విమానం’ సినిమాను చూడటమే కాకుండా వాళ్ల పిల్లలకు కూడా సినిమాను చూపించాలి. అప్పుడే ఇందులో పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శకుడు శివ ప్రసాద్, నిర్మాత కిరణ్ కి అభినందనలు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్. జీ స్టూడియోస్‌కు ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలను రూపొందిస్తోన్న జీ స్టూడియోస్ ప్రసాద్‌ని అభినందిస్తున్నానని అన్నారు.
‘విమానం’ మూవీ(Vimanam Movie)లో వీరయ్య అనే అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్, ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ వంటివారు నటించారు. ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఈ మూవీలో అతిథి పాత్రలో నటించింది. జూన్ 9వ తేదిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.