తమిళ్ హీరో దళపతి విజయ్‌కు కోలీవుడ్‌లో మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తెలుగు తప్పితే.. మిగతా భాషల్లో పెద్దగా పట్టు లేదు. అయినా గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు విజయ్. అందుకే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు.. విజయ్‌తో ‘వారసుడు’ సినిమాను తెరకెక్కిస్తున్నారని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మధ్య థియేటర్ల విషయంలో వారసుడు వివాదం అయిన సంగతి తెలిసిందే. దాంతో థియేటర్ల విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పుకొచ్చారు దిల్ రాజు. కానీ ఇప్పుడు వారసుడు సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. అలాంటిది వారసుడు కోసం.. విజయ్ 105 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ కలిపి మొత్తంగా 120 కోట్ల వరకు విజయ్ అందుకున్నట్టు టాక్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. కేవలం తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కుతున్న సినిమాకు.. విజయ్ ఇంత మొత్తంలో తీసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు విజయ్‌కు అంత సీన్ ఉందా.. అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా టోటల్ బడ్జెట్ 250 కోట్లని అంటున్నారు. అయితే పారితోషికానికి తగ్గట్టుగా ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. మరి వారసుడు సంక్రాంతికి ఎలా సందడి చేస్తాడో చూడాలి.