హిట్స్ పరంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కెరీర్లో.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సినిమాలన్నీ సోసోగానే నిలిచాయి. పైగా భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ గట్టి దెబ్బేసింది. అందుకే రౌడీ స్పీడ్‌కు కాస్త బ్రేక్ పడింది. లేదంటే పాన్ ఇండియా స్టార్‌గా రౌడీ మరింత రచ్చ చేసేవాడు. అయినా కూడా రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. కానీ ఆ స్థాయి హిట్ మాత్రం పడడం లేదు. అందుకే విజయ్ సాలిడ్‌గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.
ఈ క్రమంలో అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఖుషి(Khushi)’ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. డిసెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
షూటింగ్ మరింత ఆలస్యమవడంతో.. డిసెంబర్ నుంచి పోస్ట్‌పోన్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్లో ‘ఖుషి’ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇదే నిజమైతే రౌడీ ఫ్యాన్స్‌కు ఇంకొన్ని నెలలు నిరాశ తప్పదని చెప్పొచ్చు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు కేరళలో ఈ షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నట్లు టాక్. ఒకవేళ షూటింగ్ కంప్లీట్ అయిపోతే.. ‘ఖుషి’ని అనుకున్న టైంకే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతో విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.