Vijay Devarakonda: దెబ్బకు పాతిక నుంచి పది కోట్లకు పడిపోయాడా!?
అసలు రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో.. ఒకసారి లైగర్ ప్రమోషన్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది. జస్ట్ తెలుగులో మాత్రమే ఫాలోయింగ్ ఉన్న విజయ్.. లైగర్ రిలీజ్‌కు ముందే పాన్ ఇండియా లెవల్లో ఇండియాను షేక్ చేశాడు. కానీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఒకవేళ లైగర్ హిట్ అయి ఉంటే.. రౌడీ ఇప్పుడు వంద కోట్ల హీరో. కానీ ఇప్పుడు విజయ్ రెమ్యూనరేషన్ ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తోంది.
విజయ్ దేరవకొండ(Vijay Devarakonda)కు హిట్ పడి చాలా కాలం అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగొవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు విజయ్. కానీ లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు. అందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు లైగర్ రిలీజ్ అవకముందే.. జనగణమన కూడా స్టార్ట్ చేసేశారు. కానీ లైగర్ రిలీజ్ అయిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ఈ సినిమా దెబ్బకు పూరి ఇంకా కోలుకోలేదు. విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దాంతో ప్రజెంట్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సినిమా(Khushi Movie) విజయ్‌కు కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోను ఖుషితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు రౌడీ హీరో.
రౌడీ అభిమానులు కూడా తమ హీరోకి ఒక్క హిట్ పడితే చాలు.. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పాన్ ఇండియా క్రేజ్ మామూలుగా ఉండదని అంటున్నారు. కానీ ప్రస్తుతం విజయ్ పరిస్థితి అస్సలు బాగాలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్నాడు. అందుకే ఈ రౌడీ హీరో భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. లైగర్(Liger Movie) హిట్టైతే వంద కోట్ల స్టార్ అవాల్సిన విజయ్.. అందులో పదో వంతు, అంటే పదికోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వరకు పరిస్థితులు దిగజారినట్టు.. ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.
లైగర్ సినిమా(Liger Movie) కోసం దాదాపు పాతిక కోట్లు పారితోషికం మాట్లాడుకున్నాడు విజయ్(Vijay Devarakonda). కానీ సినిమా ఫ్లాప్ అవడంతో.. ఖర్చుల వరకు మాత్రమే తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమాకు.. విజయ్ రెమ్యునరేషన్ పదికోట్లని తెలుస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న గౌతమ్ తిన్ననూరి సినిమాకు కూడా ఇదే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మరి రౌడీ పాన్ ఇండియా(Pan India) స్టార్డమ్ ఎప్పుడొస్తుందో చూడాలి.