థియేటర్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని.. ఓటిటిలో సెకండ్ రౌండ్‌తో దుమ్ముదులుపుతున్నాయి ఆయా సినిమాలు. హిట్ అయితే థియేటర్లో రచ్చ చేయడంతో పాటు.. మరోసారి ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం థియేటర్లకు వెళ్లకుండా.. అసలెందుకు ఆ సినిమా ఫ్లాప్ అయిందని చూడడానికి.. ఓటిటి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి హిట్, ఫట్‌తో పని లేకుండా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తునే ఉంటారు ఆడియెన్స్. ఈ క్రమంలో ఇప్పుడు లైగర్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన లైగర్.. ఓటిటి విషయంలోను అదే రేంజ్లో సందడి చేస్తోంది.
హిట్ అయితే లేట్‌గా వచ్చేదేమో గానీ.. ఫ్లాప్ అయింది కాబట్టి నెల రోజులలోపే ఓటిటిలోకి వచ్చేసింది. నెగెటివ్ టాక్‌తో థియేటర్‌కు వెళ్లలేకపోయిన ఆడియెన్స్.. లైగర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. అలాగే లైగర్ ఎందుకు ఫ్లాప్ అయిందనేది వాళ్లలో మరింత ఆతృతను పెంచేసింది. దాంతో ఆడియెన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది లైగర్. సెప్టంబరు 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. హిందీ వర్షన్ మాత్రం కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ కానుంది. దాంతో ప్రస్తుతం లైగర్ ఓటిటి స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఓటిటిలో లైగర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.