బిచ్చగాడు హీరో కూతురు మీరా 16 ఏళ్ల వయసులో తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య విజయ్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకుంది? తాజాగా మీరా సూసైడ్ లెటర్ వైరల్‌గా మారింది.
Vijay Antony's daughter 'Mira' suicide letter viral!
Vijay Antony: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉంటే.. ఏ తల్లి దండ్రులు కూడా తట్టుకోలేరు. కళ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగే కూతురు ఇక కనిపించదన్న వాస్తవాన్ని క్షణమైనా భరించలేరు. ప్రస్తుతం విజయ్ ఆంటోని అలాంటి బాధనే భరిస్తున్నాడు. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19వ తేదీన తెల్లవారుజామున ఉరి వేసుకుంది మీరా. అపస్మారక స్థితిలో ఉన్న మీరాను కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేలోపులో ప్రాణాలు కోల్పోయింది.
మీరా ఆంటోని మరణంతో విజయ్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయారు. మీరా కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టుగా.. అందుకే ఆత్మహత్యకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మీరా గదిలో సూసైడ్ నోట్ దొరికినట్టు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ లెటర్ నోట్‌బుక్‌లో దొరికిందట. చెన్నై పోలీసులు మీరా రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
తన స్నేహితులను, టీచర్స్‌ను మిస్ అవుతానని.. తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని రాసినట్టుగా తెలుస్తోంది. చివర్లో.. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసిందట. నిజంగానే మీరా డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుందా? లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. మీరా పోస్ట్ మార్టంలో డాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ధ్రువీకరించారు. ఏదేమైనా.. ప్రస్తుతం విజయ్ ఆంటోని ఫ్యామిలీని ఓదార్చడం ఎవ్వరీ వల్ల కావడం లేదు.