»Video Viral Actress Rohini Is Unable To Get Up From The Hospital Bed
Video Viral: ఆస్పత్రి బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో నటి రోహిణి!
కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
నటి రోహిణి(Actress Rohini) గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఓ వైపు జబర్దస్త్ షో(Jabardasth Show) చేస్తూనే మరో వైపు సినిమాల్లో బిజీ అయ్యింది రోహిణి. కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లే రోహిణి తన మాటలతో అందర్నీ నవ్విస్తుంటుంది. ఇటీవలె రోహిణి ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, కాలు సర్జరీ కోసం తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లినట్లు రోహిణి తెలిపింది.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో తన కాలుకు సంబంధించిన సర్జరీ(Surgery) వివరాలను వెల్లడించింది. 5 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్(Accident)లో తన కాలుకు రాడ్ వేసినట్లు రోహిణి(Actress Rohini) తెలిపింది. ఆ రాడ్‌ను తీయించేందుకు వరుస షూటింగుల వల్ల వీలు కాలేదని, ఇప్పుడు కాస్త ఫ్రీ టైమ్ దొరకడంతో రాడ్ తీయించి విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి రోహిణి వీడియో:
అయితే ఆమె రాడ్ తీయించుకోవడం చాలా ఆలస్యం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. బలవంతంగా రాడ్ తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు రోహిణి(Actress Rohini)ని హెచ్చరించారు. చివరికి రాడ్ తొలగించకుండా రోహిణి(Actress Rohini)కి మైనర్ సర్జరీ(Surgery) మాత్రమే చేసి పంపారు. ప్రస్తుతం రోహిణి ఆస్పత్రిలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తనకు సపర్యలు చేస్తున్న తన తల్లి వీడియోను షేర్ చేస్తూ “హ్యాపీ మదర్స్ డే అమ్మా..ఐ లవ్ యూ సో మచ్, నువ్వు లేకుండా నేను ఏమీ కాదు. నువ్వే నా సర్వస్వం. నీ కోసం ఏమైనా చేస్తాను అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.