Balakrishna Movie : బాలకృష్ణ NBK108 నుంచి వీడియో లీక్!
బాలయ్య NBK 108 సినిమా షూటింగ్స్ ను ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 14 నుంచి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్(Action Scenes)ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సెట్స్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన తన 108వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి అనిల్ రావిపూడి(Anil Raavipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇటీవలె ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ (First Look)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య మాస్ డైలాగ్స్ ను తెలంగాణ యాసలో వినేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
బాలయ్య NBK 108 సినిమా షూటింగ్స్ ను ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 14 నుంచి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్(Action Scenes)ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సెట్స్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. వీడియోలో ఫైట్ సీన్స్ కోసం ఏర్పాటు చేసిన క్రేజ్, రోప్స్ అండ్ సెట్ ప్రాపర్టీ మొత్తం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
ఈ మూవీలో బాలయ్య(Balayya)కు జోడీగా కాజల్ అగర్వాల్(kajal Agarwal) నటిస్తోంది. హీరోయిన్గా శ్రీలీల(Sree Leela) ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
అనిల్ రావిపూడి(Anil Raavipudi) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్(SS Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్య గత రెండు మూవీస్ కు కూడా థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాలయ్య(Balayya)తో థమన్ కు ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.