Venkatesh: పెద్దోడు, చిన్నోడు ఇద్దరు హిట్ కొడతారు!
సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ సైంధవ్. 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం. వెంకీ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు(mahesh babu) ‘గుంటూరు కారం(Guntur Kaaram)’తో పాటు వెంకటేష్(Venkatesh)’సైంధవ్(saindhav)’ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరు కలిసి గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు’ సినిమాలో నటించారు. అసలు ఈ జనరేషన్‌కు బూస్టింగ్ ఇచ్చిన మల్టీస్టారర్ సినిమా ఇదే. అందుకే వెంకీ, మహేష్ మధ్యా మంచి బాండింగ్ ఉంది. తాజాగా వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ టీజర్ రిలీజ్ చేశారు. శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం సైంధవ్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్‌తో.. గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్లో కనిపిస్తున్నాడు వెంకటేష్. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమై.. చంద్రప్రస్థ అనే టౌన్లో భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు చూపించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా కనిపించిన ఈ టీజర్లో.. సైకోగా వెంకటేష్ ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఘర్షణ సినిమాలో వెంకీ ఎంత పవర్ ఫుల్‌గా కనిపించాడో.. అంతకుమించి అనేలా కనిపించాడు ఈ టీజర్లో. దీంతో దగ్గుబాటి అభిమానులు.. అంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక టీజర్ లాంచ్ సందర్భంగా వెంకీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి పండుగకు పెద్దోడు, చిన్నోడు కలిసొస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందనుకుంటున్నారు..? అన్న ప్రశ్నకు వెంకీ స్పందిస్తూ.. పెద్దోడొస్తే సూపర్ హిట్టు.. చిన్నోడొస్తే సూపర్ హిట్టు. ప్రేక్షకులు పెద్దోడి కోసం, చిన్నోడి కోసం వెయిట్ చేస్తున్నారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ కొట్టిన విషయం గుర్తు లేదా..? అభిమానులు.. పెద్దోడి సినిమాకు వెయిట్ చేస్తున్నారు.. చిన్నోడి సినిమాకు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరం.. ఒకేసారి రావడం.. చాలా సంతోషంగా ఉంది. రెండు సినిమాలు మంచి హిట్(hit) అందుకుంటాయి’.. అని చెప్పుకొచ్చాడు. మరి పెద్దోదు, చిన్నోడు కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.