సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి చెప్పుకోకుండా ఉంటుంది. హిట్ అయితే హ్యాపీ, లేదంటే మాత్రం ఆ జీవితాన్ని కొన్నిసార్లు ఊహించడం కష్టమే. అయినా కూడా టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర(anil sunkara) సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
we made some costly mistakes anil sunkara viral tweet
గతంలో దూకుడు, లెజెండ్, సరిలేరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నిర్మాతగా భాగమైన అనిల్ సుంకర(anil sunkara).. ఇప్పుడు మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోతున్నాడు. గత రెండేళ్లలో ఈయన నిర్మించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన ‘మహాసముద్రం’ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు కనీసం ప్రమోషన్స్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఇక పోయిన సమ్మర్లో అతిపెద్ద డిజాస్టర్‌గా అఖిల్ ‘ఏజెంట్’ సినిమా నిలిచింది. అసలు అఖిల్ మార్కెట్‌కు సంబంధం లేకుండా.. ఏకంగా 80 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్‌ను నిర్మించాడు. ఈ సినిమా కూడా 50 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ ఇటీవల వచ్చిన భోళా శంకర్ యాభై కోట్లకు పైగానే నష్టం తెచ్చిపెట్టింది.
అయితే ఈ మధ్య అనిల్ సుంకర నుంచి వచ్చిన ‘సామజవరగమన(samajavaragamana)’ మాత్రం మంచి విజయాన్ని అందుకుని.. మంచి లాభాలే తెచ్చిపెట్టింది. కానీ ఈ రెండేళ్లలో ఈ మెగా ప్రొడ్యూసర్ దాదాపు 200 కోట్ల వరకు లాస్ అయ్యాడు. తాజాగా ఈ విషయాల గురించి స్పందిస్తూ.. తాను కొన్ని ఖరీదైన తప్పులు చేశానని అనిల్ సుంకర ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ సంస్థ సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవ కోన’ అనే సినిమా వస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత డైరెక్టర్ విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందా? విరూపాక్షకు కాపీనా? అనే సందేహాలు వెలువడ్డాయి.
ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ.. ఊరుపేరు భైరవకోన(OoruPeruBhairavakona) ‘విరూపాక్ష’ను పోలి ఉండదు. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయి.. సంతృప్తి చెందే వరకు రిలీజ్ డేట్‌ను ప్రకటించనని చెప్పాడు. దీంతో వీఐ ఆనంద్ పోస్ట్‌కి అనిల్ సుంకర రీ ట్వీట్ చేస్తూ.. ఇప్పటికే మేము కొన్ని ఖరీదైన తప్పులు చేసాము. ఇకపై పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నాము.. అని రాసుకొచ్చారు. ఊరు పేరు భైరవకోన లాంటి సినిమా వీఎఫ్ఎక్స్ పూర్తయిన తరువాత రిలీజ్ డేట్ చెబుతామని చెప్పుకొచ్చాడు. మొత్తంగా.. అనిల్ సుంకర ఇన్నాళ్లకు రియలైజ్ అయినట్టున్నాడు.
We made some costly mistakes and trying not to repeat any more. Quality of VFX is always proportional to the time we can give. And for a movie like #OoruPeruBhairavakona , we want to announce the date as soon as VFX is complete. We are confident that the movie will reach the high… https://t.co/6f3Ui32u5T