»Allu Arjun Went To Delhi With His Wife Sneha Reddy
Delhi:లో పుష్పగాడి రూల్..కానీ అల్లు స్నేహను చూస్తే షాక్!
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్టార్ హీరోగాను గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో తన నటనకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ హీరో ఢీల్లీ చేరుకున్నాడు.
Allu Arjun went to Delhi with his wife sneha reddy
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రీసెంట్గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల(national film awards 2023)లో ఉత్తమ నటుడుగా అవార్డు సొంతం చేసుకుని చరిత్ర తిరగరాశాడు అల్లు అర్జున్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్నాడు. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్, మహేష్ సరసన అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే దుబాయ్‌కి వెళ్లి మైనపు విగ్రహానికి కావాల్సిన కొలతలను ఇచ్చాడు బన్నీ.
అయితే.. ఇప్పటికే ప్రకటించిన 69వ జాతీయా అవార్డుల కార్యక్రమం అక్టోబర్ 17న ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరగనుంది. అందుకోసం భార్య అల్లు స్నేహ(sneha reddy)తో కలిసి ఢిల్లికి వెళ్లాడు బన్నీ. ఎయిర్పోర్ట్ లో ఉన్న వీరి ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కంటే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. వైట్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన స్నేహరెడ్డి హీరోయిన్ రేంజ్లో.. కూలింగ్ గ్లాసెస్ ధరించి చాలా స్టైలిష్‌గా కనిపించింది. దీంతో స్నేహ లుక్ అదిరిపోయేలా ఉందని.. ఎంతలా అంటే, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్నే డామినేట్ చేసేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించారు. ఇక బన్నీతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్(devi sri prasad) కూడా అవార్డు అందుకున్నాడు. దీంతో పుష్ప 2 పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది.