ప్రస్తుతం రామ్ చరణ్(ram charan) క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చరణ్ పేరు చెబితే చాలు. మిగతా సినిమాలకు ఓ రేంజ్లో పబ్లిసిటీ వస్తోంది. ఇప్పటికే లియోలో చరణ్ ఉన్నాడని చెబుతుండగా.. ఇప్పుడు మరో సినిమా అని ప్రచారం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ అనుకున్న సమయానికి కంప్లీట్ అవడం లేదు గేమ్ చేంజర్. అసలు చరణ్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది. ఎందుకంటే.. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు చరణ్. దీంతో పాటు ఆచార్య కూడా కంప్లీట్ చేశాడు. కానీ గేమ్ చేంజర్ పరిస్థితేంటనేది ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనేది ఎటూ తేల్చలేకపోతున్నాడు శంకర్.
ఇండియన్2 వల్ల గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అర్థం కాకుండా పోయింది. కానీ అప్పుడే చరణ్, శంకర్(shankar) మరో ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు లియో సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడని ప్రచారం చేసిన కోలీవుడ్ మీడియా.. ఇప్పుడు ఇండియన్ 3 సినిమాను చరణ్‌తో చేసేందుకు శంకర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని వార్తలు రాస్తున్నాయి. అంతేకాదు ఇండియన్ 2(indian2) క్లైమాక్స్‌లో చరణ్ ఎంట్రీ ఉండేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడని..శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు.
ఇలా.. ఎలా పడితే అలా రామ్ చరణ్(Ram Charan)ను పేరును ఈ మధ్య బాగా వాడుతోంది తమిళ మీడియా వర్గాలు. అయితే ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలానే ఉన్నప్పటికీ..అసలు గేమ్ చేంజర్ సినిమానే పూర్తవలేదు. కానీ అప్పుడే ఇండియన్ 3(indian3) లైన్లోకి రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటికే చరణ్, బుచ్చి బాబుతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. శంకర్ కూడా భారీ బడ్జెట్ సినిమాల ప్లానింగ్‌లో ఉన్నాడు. కాబట్టి.. ఇండియన్ 3లో నిజముందని ఖచ్చితంగా చెప్పలేం.