ప్రవీణ్ సత్తారు(Director Praveen sattaru) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం గాంఢీవధారి అర్జున (Gandeevadhari Arjuna Movie). ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్(Posters), ప్రీ టీజర్ (pre Teaser) వంటివి విడుదలయ్యాయి. హాలీవుడ్ (Hollywood) స్టైల్ విజువల్స్‌తో ప్రీ టీజర్ అదర్నీ ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
‘గాంఢీవధారి అర్జున’ టీజర్:
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు(Movie Posters) జేమ్స్ బాండ్ తరహాలో ఉన్నాయి. ఈ మూవీతో వరుణ్ తేజ్ (Varun Tej) బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం అని అందరూ అంటున్నారు. తాజాగా ఈ గాంఢీవధారి అర్జున(Gandeevadhari Arjuna Movie) మూవీ నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఆగస్టు చివరి వారంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.