సినీ ఇండస్ట్రీలోసెలబ్రిటీలుగా ఉన్నవారంతా హ్యాపీగా ఉండారు. అందులో కొంత మంది వింత వ్యాధులతో బాధపడుతున్నారు. మనశ్శాంతి లేక ఇంకొంత మంది ఇబ్బందుులు పడుతున్నారు. తాజాగా హీరోయిన్ వితికా శేర్ (Vithika Sher) తనకున్న వ్యాధి గురించి వెల్లడించింది. సెలబ్రిటీలంటే లగ్జరీ లైఫ్, స్టార్ హేజ్, కాస్ట్లై లైఫ్ స్టైల్.. సోషల్ మీడియా (Social media) ఫాలోయింగ్ లాంటివే గుర్తుకు వస్తాయి అందరికి. కాని వారు పడే ఇబ్బందులు సామాన్య ప్రజలకి తెలియవు పట్టించుకోరు.
డబ్బు మాత్రమే ఉంటే సరిపోతు.. ఇతర ఇబ్బందులు కూడా లేకుండా మనశ్శాంతితో ఉండగలడగడం కూడా ముఖ్యమే. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఉంటే అదే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు డబ్బున్నా.. ఆనారోగ్యాలతో ఇబ్బందిపడేవారు ఉన్నారు. తాజాగా ఆలిస్ట్ లో వరుణ్ సందేశ్ (Varun Sandesh) భార్య వితికా కూడా చేరింది. ఆమె తాను అనారోగ్యంతో పడుతున్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పరిచయమయ్యారు నటి వితికా షేర్. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది బ్యూటీ.
తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్, మైగ్రేన్(Migraine)తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి వెన్నుపోటు కలుగుతున్నాయని, ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ (Physiotherapy) చేయించుకుంటున్నట్టు కూడా వెల్లడించింది. ఇటీవలే నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్టు వితిక పేర్కొంది. వితిక ఆనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.