మెగాస్టార్‌కు రీమేక్‌లు కలిసి రావడం.. చిరు సీమకు వెళ్లినప్పుడు వర్షం పడడం.. ట్రైలర్ దుమ్ములేపేలా ఉండడం.. అంతకు మించి అనేలా ప్రమోషన్స్.. ఇలా అన్ని విధాలుగా గాడ్ ఫాదర్ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దాంతో అక్టోబర్ 5 కోసం గ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. అయితే రెండు విషయాల్లో మాత్రం అప్సెట్ అవుతున్నారు. గాడ్ ఫాదర్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే బాలీవుడ్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ ఉండడంతో గాడ్ ఫాదర్‌కు హిందీలో కలిసొచ్చే అంశమే అని చెప్పాలి. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సల్మాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉండేది.. అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ట్రైలర్ చివర్లో చిరంజీవి చేతులు వెనుకాల పెట్టుకుని ధీమాగా నడిచి వస్తుంటే.. సల్మాన్ ఖాన్ నోట్లో కత్తి పట్టుకుని వచ్చే షాట్‌కు ఫిదా అవుతున్నారు అభిమానులు. దాంతో ఇలాంటి సీన్ పవన్‌తో పడి ఉంటే.. బాక్సాఫీస్ మరింత బద్దలయి ఉండేదని అంటున్నారు. ఇదిలా ఉంటే మరో విషయంలో మరింత అప్సెట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ మెగా లేడీ ఫ్యాన్.. యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. చిరంజీవి నటించిన చిత్రాల్లో డిజాస్టర్ మూవీ ఆచార్య అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. దాంతో ఊహించని విధంగా ఆచార్య ప్రస్థావన రావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో దీనిపై ట్రోల్స్ చేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.