Dil Raju : చిన్న ఆటో మొబైల్ షాప్‌తో సంపాదన ప్రారంభించి, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఎన్నో విజయాలను అందుకున్నారు. నిర్మాతగా టాలీవుడ్‌కి ఎన్నో కల్ట్ క్లాసికల్ సూపర్ హిట్ చిత్రాలను అందించిన వ్యక్తి దిల్ రాజు. నిర్మాతగా ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు. ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్‌గానూ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఏటా ఐదు సినిమాల షూటింగ్స్ ని మేనేజ్ చేస్తూ నంబర్ 1 ప్రొడ్యూసర్ గా చక్రం తిప్పుతున్న దిల్ రాజు ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణలో త్వరలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికలు మార్చి లేదా ఫిబ్రవరి నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారా?, దిల్ రాజు, కవిత పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. అయితే ఈసారి ఈ స్థానం నుంచి కవిత పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉండడంతో ప్రధాన పోటీ ఉంటే అది బీజేపీ అభ్యర్థి అరవింద్, దిల్ రాజు మధ్యే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 నిర్మాతగా ఉన్న దిల్ రాజు రాజకీయాల్లోనూ రాణిస్తాడో లేదో చూడాలి.