తెలంగాణ(Telangana) నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి. తాజాగా మరో సినిమా రానుంది. తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో జీవన విధానం, అక్కడి ప్రజల ఆచారాలు, నమ్మకాలపై మరో సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే 'రుద్రంగి'(Rudrangi).
తెలంగాణ(Telangana) నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి. తాజాగా మరో సినిమా రానుంది. తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో జీవన విధానం, అక్కడి ప్రజల ఆచారాలు, నమ్మకాలపై మరో సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే ‘రుద్రంగి'(Rudrangi). రసమయి బాలకిషన్(Rasamai balakishan) సొంత బ్యానర్లో ఈ మూవీ రావడం విశేషం.
తాజాగా ‘రుద్రంగి. సినిమా(Rudrangi Movie) నుంచి టైటిల్ సాంగ్(Title song)ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ”త్యాగాలే నిను తలచి తలవంచి..మొక్కాలే మా తల్లి నీకమ్మా, నవ్వేటి పువ్వులే గోసరిల్లి వసివాడిపోయెనే మా యమ్మా..రుద్రంగి” అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘రుద్రంగి'(Rudrangi) సినిమాకు నాఫల్ రాజా మ్యూజిక్ అందించారు. ఈ పాటను మానుకోట ప్రసాద్ రాశారు. అద్భుతమైన సాహిత్యం ఈ పాటలో చూడొచ్చు. అలాగే ఈ పాటను కైలాస్ ఖేర్(Khailash kher) పాడారు. ‘రుద్రంగి'(Rudrangi) సినిమాలో జగపతి బాబు(Jagapati babu), విమలా రామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్ వంటివారు నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదిన విడుదల(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.