యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌కి పాకింది. అందుకే ప్రస్తుతం భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో తారక్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలో అప్ కమింగ్ ఫిల్మ్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొరటాల శివ పవర్ ఫుల్ స్టోరీ లాక్ చేశాడు..
త్వరలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో వెనకబడిపోయాడు తారక్. మరోవైపు పుష్ప క్రేజ్‌తో కమర్షియల్ పరంగా దూకుడు మీదున్నాడు అల్లు అర్జున్. అలాగే రామ్ చరణ్ కూడా పలు యాడ్స్ చేస్తున్నాడు. అంతకు ముందు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యంగ్ టైగర్..
ఈ మధ్య మాత్రం కమర్షియల్‌గా దూరంగా ఉన్నాడు. కొరటాల ప్రాజెక్ట్ కోసమే ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ కమర్షియల్ యాడ్స్ చేసేందుకు సై అంటున్నాడట ఎన్టీఆర్. అంతేకాదు ప్రస్తుతం ఓ యాడ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని తెలుస్తోంది. ఇది ప్రముఖ బ్రాండ్ ఫాంటాకు సంబంధించిన యాడ్ అని సమాచారం. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.
ఈ యాడ్ కోసం తారక్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ కమర్షియల్‌గా ఎన్టీఆర్ దూకుడు పెంచడం ఖాయమంటున్నారు. అయితే కమర్షియల్ పరంగా ఓకే.. కానీ ఎన్టీఆర్ 30 అఫిషీయల్ అప్టేట్ కావాలంటున్నారు అభిమానులు. అన్నట్టు అన్నీ కుదిరితే ఎన్టీఆర్ 30ని వచ్చే దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.