Tiger-3: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబోలో రాబోతున్న చిత్రం టైగర్-3(Tiger-3). యష్ రాజ్ ఫిలింస్‌లో రానున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కానున్నది. ఎప్పుడూ లేని విధంగా సౌత్‌లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సల్మాన్ సినిమాగా రికార్డు ఎక్కనుంది. పఠాన్, జవాన్ వంటి సినిమాలు సౌత్‌లో బాగా థియేటర్ల వద్ద సందడి చేయడంతో.. టైగర్-3(Tiger-3) సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీటిని చూసి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏ సినిమాలో కూడా చేయని సాహసాలు కత్రినా ఇందులో చేసిందట. మూవీ టీమ్ తాజాగా కత్రినా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. చేతిలో గన్ పట్టుకుని షూట్ చేస్తూ.. యాక్షన్ లుక్‌లో కనిపించింది. రూ.300కోట్ల బడ్జెట్‌తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో భారీ అంచనాలు ఉన్నాయి. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. జీవితాన్ని దేశానికి అర్పించి ఇరవై ఏళ్ల నుంచి చేస్తున్న సేవను మరిచిపోయి దేశ ద్రోహి అంటూ ముద్ర వేస్తే.. దానిని చెరిపేసుకోవడానికి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలని దేశాన్ని కోరడం, దేశం కోసం పోరాడటం వంటివన్నీ టీజర్లో కనిపించాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా స్టోరీ కూడా సర్ప్రైజింగ్గా ఉంటుందట.