»Mia Khalifas Controversial Palestine Support Tweet Viral Social Media
Mia Khalifa: వివాదాస్పద ట్వీట్..నెట్టింట హల్చల్
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడి నేపథ్యంలో మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా(mia khalifa) ఓ ట్వీట్ చేసింది. అది కాస్తా ప్రస్తుతం వివాదాస్పదం కావడంతో ఆమెను అనేక మంది విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న పలు కంపెనీలు సైతం వారి ఒప్పందం రద్దు చేసుకున్నాయి. అయితే అసలు ఏం ట్వీట్ చేసింది. దేని గురించి అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
Mia Khalifas controversial palestine support tweet viral social media
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో తాజాగా ప్రముఖ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన పోస్ట్‌లో ఖలీఫా(mia khalifa) ఇలా పేర్కొంది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సరిగా కనిపించడం లేదని తెలిపింది. ఆ క్రమంలో పాలస్తీనా ఫైటర్లు ఫోన్లను అడ్డంగా పట్టుకుని వీడియోలు రికార్డు చేయాలని ఎద్దేవా చేస్తున్నట్లు కామెంట్ చేసింది. అయితే ఈమె చేసిన ట్వీట్ వైరల్ కావడంతో అనేక మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలస్తీనాకు తన మద్దతును వ్యక్తం చేయడంతో ఖలీఫా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. పోస్ట్‌లో ఆమె పాలస్తీనా “స్వాతంత్ర్య సమరయోధులను” అడ్డంగా చిత్రీకరించమని కోరింది. ఆమె పదాల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఆ ట్వీట్ వైరల్ కావడంతో ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ ప్లే బాయ్ ఓ ప్రకటన చేసింది. మియా ఖలీఫాతో తమ అగ్రిమెంట్(agreement) రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. మాజీ పోర్న్ స్టార్ తో అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతున్న టోడో షపిరో కంపెనీ కూడా స్పందించింది. మీ ట్వీట్ చాలా భయాంగా ఉందన్నారు. మీరు మానవత్వం ఉన్న మనిషిగా మారాలని మా కంపెనీ తరఫున కోరుకుంటున్నామని చెబుతూ ఖలీఫాతో అగ్రిమెంట్ కుదుర్చుకోలేమని వెల్లడించారు. దయచేసి పరిణామం చెందండి. మంచి మానవుడిగా మారండి. మీరు మరణం, అత్యాచారం, కొట్టడం, బందీలను క్షమించడం నిజంగా భయంకరమైన అంశాలని ప్రస్తావించింది. మీ అజ్ఞానాన్ని ఏ పదాలు వర్ణించలేవని తెలిపారు.
అయితే ఆమె పాలస్తీనా(palestina)కు సపోర్ట్ చేయడం పట్ల పలు కంపెనీలు బిజినెస్ అగ్రిమెంట్ ను రద్దు చేసుకోవడంపై కూడా ఖలీఫా స్పదించింది. తాను లెబనాన్ లో పుట్టి పెరిగానని, స్వాతంత్రం కోసం పడే తపన ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పింది. పాలస్తీనా పౌరులు నిజంగా స్వాతంత్ర సమరయోధులను వెల్లడించింది. తన మాటలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యల కారణంగా బిజినెస్ అగ్రిమెంట్ రద్దు చేసుకున్న కంపెనీలతో తాను ఇంతకాలం ఎలా పనిచేశాననే బాధ కూడా ఉందని తెలిపింది.