Tholi prema Re Release: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటో గ్యాలరీ
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో క్లాసిక్ హిట్‌గా ‘తొలిప్రేమ’ సినిమా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఈ మూవీలో నటించారు.
తొలిప్రేమ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం 1998 జులైలో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.
ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ‘తొలిప్రేమ’ సినిమా ఒకటిగా నిలిచింది. ప్రేక్షకుల హృదయాల్లో ఈ మూవీ చెరగని ముద్రను వేసింది.
‘తొలిప్రేమ’ విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.