Power Star పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ రిలీజ్ ఇదే!
Power Star : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ అవకముందే.. 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ అవకముందే.. ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేయబోతున్నారు పవన్. ఈ నెల 25 వరకు పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తికానుందని తెలుస్తోంది. ఇదే స్పీడ్‌లో ఈ సినిమాను షూటింగ్‌ను ఫినిష్ చేసి.. సమ్మర్లోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఏప్రిల్ వరకు షూటింగ్ పూర్తి చేసుకుని.. మే సెకండ్ వీక్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇదే జరిగితే హరిహర వీరమల్లు కంటే ముందే.. రీమేక్ రిలీజ్ కానుందని చెప్పొచ్చు. ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్లు కావొస్తున్న షూటింగ్‌కే నోచుకోవడం లేదు. కానీ ఫిబ్రవరిలో మొదలైన రీమేక్ మాత్రం.. మూడు నెలల్లోనే థియేటర్లోకి రాబోతుండడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్ కూడా రెడీ అయింది. డైరెక్టర్ హరీష్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ అయనంకా బోస్.. సెట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ వెంటనే సాహో డైరెక్టర్ సుజిత్‌తో OG సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరి హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడో చూడాలి.