పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జూన్‌లో ఆదిపురుష్ రానుంది కాబట్టి.. 2023 ఎండింగ్లో లేదా 2024 సంక్రాంతికి సలార్ రానుందని అంటున్నారు.
అయినా సలార్ ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. భారీ సెట్లో ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట.
గతంలో కూడా సలార్ భారీ యాక్షన్ అప్టేట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు అంతకుమించి అనేలా ఈ సీక్వెన్స్ రూపొందిస్తున్నారట. దాంతో సలార్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ఈ సినిమాతో తమ మాసివ్ దాహం తీరడం పక్కా అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. పైగా ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత..
సలార్ థియేటర్లోకి ఎప్పుడెప్పుడొస్తుందా.. అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కెజియఫ్ ఫేం రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని.. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి అంచనాలను పెంచుతునే ఉన్న సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.