పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త తరహా ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. విక్రమ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraju)తో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ ను తెరపైకి తీసుకురాబోతున్నట్లు కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే సెట్స్ పైన కల్కి సినిమా(Kalki movie)తో పాటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా ఉంది.
ఇక సలార్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సలార్ (Salar) మరొక పార్ట్ ఉండగా కల్కి కూడా రెండవ భాగం కూడా భవిష్యత్తులో రానుంది. అయితే సందీప్ రెడ్డి (Sandeep Reddy) దర్శకత్వంలో కూడా స్పిరిట్ అనే ఒక సినిమాను చాలా కాలం క్రితం అనౌన్స్ కూడా చేశారు. ఇక ఈ ప్రాజెక్టులతో పాటు ప్రభాస్ రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త తరహా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. సీతారామం దర్శకుడు హను రాఘవపుడితో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి.