హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియ్ రూపురేఖలు మారబోతున్నాయి.అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) కోసం స్టేడియం పునరుద్ధరణ పనులు: ప్రారంభం అయ్యాయి. స్టేడియంలో దక్షిణంవైపు దెబ్బతిన్న పైకప్పు మరమ్మతు పనులు, తూర్పు, పడమర స్టాండ్లపై కూడా పైకప్పు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఫ్లడ్‌లైట్ల (Floodlights) స్థానంలో LED లైట్లు, రెండు న్యూస్ స్క్రీన్లు ఇన్స్టాల్ చేయనున్నారు.ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంతో సహా దేశంలోని మరో నాలుగు మైదానాల్ని ఆధునికీకరించేందుకు బీసీసీఐ (BCCI) ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఇందుకోసం మొత్తంగా 502.92 కోట్లను కేటాయించింది. ఉప్పల్ స్టేడియా(Uppal Stadium)నికిరూ.117.17 కోట్లు కేటాయించగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ (Garden Eden) కు రూ.127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, పంజాబ్‌లోని మొహాలీ స్టేడియానికి రూ.79.46 కోట్లు, ముంబై వాంఖడే(Mumbai Wankhede)కు రూ.78.82 కోట్లు కేటాయించింది.అయితే వీటితో పాటు ఎప్పట్నుంచో పెండింగులో ఉన్న దక్షిణ భాగం పైకప్పును మరమ్మత్తు చేసి పుణ్యం కట్టుకోవాలని తెలుగు అభిమానులు.. బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ సమరం మొదలుకానుంది. మొత్తం 46 రోజుల పాటు సాగే ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరుగుతాయి. 2011లో భారత్ చివరిసారిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వగా.. ధోని సారథ్యంలోని టీమిండియా(Team India) విజేతగా నిలిచింది.