Bunny : ఇది బన్నీ అంటే.. 20 ఏళ్లలో అందరి నోర్లు మూయించాడు!
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి.. ప్రపంచ నలుమూలాల నుంచి బర్త్ డే విషెస్ వస్తున్నాయి. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి.. ప్రపంచ నలుమూలాల నుంచి బర్త్ డే విషెస్ వస్తున్నాయి. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం అల్లు అర్జున్‌కి బర్త్ డే విషెస్ చెప్పాడు. వార్నర్ తన కుమార్తె ఐలాతో కలిసి బన్నీకి విషెస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌కి హ్యాపీ బర్త్ డే.. పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం.. అంటూ వార్నర్ విష్ చేశాడు. ఇక పుష్ప హీరోయిన్ రష్మిక మందన.. బన్నీకి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. అల్లు అర్జున్‌తో కలిసి బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. బన్నీ బర్త్ డే గిఫ్ట్‌గా రిలీజ్ చేసిన పుష్ప2 ఫస్ట్ లుక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. తనొక పాన్ ఇండియా హీరో అనే స్టాటస్‌ను సైతం పక్కకు పెట్టి మరీ.. చీరకట్టి అమ్మవారి వేషంతో షాక్ ఇచ్చాడు బన్నీ. శరీరం అంతా నీలం రంగు.. చీరకట్టు.. చేతికి గాజులు.. ఓ చేతిలో గన్ పట్టుకుని అమ్మోరులా నిలుచున్నాడు. పుష్ప2 ఫస్ట్ లుక్ చూసిన తర్వాత.. బన్నీ గట్స్‌కు ఎవరైనా హ్యాట్సఫ్ అనాల్సిందే. అందుకే సోషల్ మీడియాలో బన్నీ డేరింగ్ స్టెప్‌కు విమర్శకులు సైతం జేజేలు కొడుతున్నారు. కానీ ఇరవై ఏళ్ల కిందట.. అంటే 2003లో గంగోత్రి సినిమాలో బన్నీ చీర కడితే.. ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పటికీ బన్నీని ట్రోల్ చేయడానికి అదే ఫోటోని వాడుతున్నారు యాంటి ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అలాంటి నోర్లే బన్నీకి జై కొడుతున్నాయి. ముందు నుంచి హార్డ్ వర్క్‌ని నమ్ముకున్న బన్నీ.. తనని విమర్శించిన వారికి.. ఈ ఇరవై ఏళ్లలో గట్టిగా సమాధామే చెప్పాడు. అందుకే.. పుష్ప2 సినిమాతో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో.. ఎలాంటి సందేహాలు లేవు.