»The Star Singer Who Was Admitted To The Hospital Fans Are Worried
Bombay Jayashri: ఆస్పత్రిలో చేరిన స్టార్ సింగర్..ఆందోళనలో ఫ్యాన్స్
బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ప్రముఖ సింగర్ బాంబే జయశ్రీ(Bombay Jayashri) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రి(Hospital)కి తరలించారు. శుక్రవారం లివర్ పూల్ లోని ఓ హోటల్ లో ఉన్న బాంబే జయశ్రీ మెడ నొప్పితో అపస్మారక స్థితికి చేరినట్లుగా సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం బాంబే జయశ్రీ యూకే(UK) పర్యటనలో ఉన్నారు.
పర్యటనలో భాగంగా బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
పద్మశ్రీ పురష్కార గ్రహీత అయిన బాంబే జయశ్రీ(Bombay Jayashri) కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడారు. ఆమెకు ఈ మధ్యనే సంగీత అకాడమీ ద్వారా సంగీత కళానిధి పురస్కారం కూడా లభించింది. బాంబే జయశ్రీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు(Fans) ఆందోళన చెందుతున్నారు.