»Pawan Kalyan Movie Vinodaya Seetham Release Date On July 28th 2023
Pawan Kalyan మూవీ వినోదయ సీతం రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి అధికారిక రీమేక్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సముద్రకని(samuthirakani) డైరెక్షన్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి తేజ్(sai dharam tej) నటిస్తున్న చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను జూలై 28, 2023న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తమిళ్ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్ సినిమాకి రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ సినిమాకు సముద్రకని(samuthirakani) దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించాడు. ఈ క్రమంలో రోజుకు రెమ్యునరేషన్ 2 కోట్లు రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ తొలిసారి కలిసి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా నిరీక్షణల తర్వాత, ‘PKSDT’ నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా కోసం యంగ్ మూవీ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి పని చేయనున్నాడు. ఆ కొత్త ప్రాజెక్ట్‌ను డీవీవీ(DVV) ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
ఇప్పటికే పవన్ నటించిన హరి హర వీర మల్లు(hara hara veera mallu) చిత్రం మార్చి 30, 2023న విడుదల కానుంది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ నటించారు. పవన్ కళ్యాణ్ చివరిసారిగా 2022లో వచ్చిన భీమ్లా నాయక్ చిత్రంలో యాక్ట్ చేశారు. రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.