CTR: పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన దంపతులు డీఎస్సీలో విజయం సాధించారు. ఆర్.గిరి ప్రసాద్ 82.16 మార్కులు, ఆయన భార్య హేమావతి 81.86 మార్కులతో DSC SGT పరీక్షలో విజయాలు సాధించారు. ఈ మేరకు ఇద్దరూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మిత్రులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వారి కృషిని పలువురు అభినందించారు.