ప్రకాశం: పెద చెర్లోపల్లి పోలీస్ స్టేషన్ను ఆదివారం కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తనిఖీ చేశారు. ఈ మేరకు పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసులు, పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో కనిగిరి సీఐ ఖాజావలి, ఎస్సై కోటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.