»The Photo Of Anushkas Father Meeting Prabhas Has Gone Viral
Prabhas: ప్రభాస్‌ను కలిసిన అనుష్క తండ్రి
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. అనుష్క తండ్రి ప్రభాస్‌ను కలిసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
The photo of Anushka's father meeting Prabhas has gone viral
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నప్పటికీ తనపై కొన్ని రూమర్స్ అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఇక సినిమా పరిశ్రమలో కాకుండా బయట కూడా తన పెళ్లి గురించి అడుగుతూనే ఉంటారు. ఆదిపురుష్(Adipurush) ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను పెళ్లి చేసుకుంటానని, అది తిరుపతిలోనే చేసుకుంటాను అంటూ అభిమానులకు మాట ఇచ్చాడు. దాంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అనుష్క, ప్రభాస్ రిలేషన్లో ఉన్నారంటూ చాలా రోజుల నుంచి వార్తలు చెక్కర్లు కొడుతున్నప్పటికీ ఎప్పుడు దీని గురించి వారు స్పందించలేదు. ఇటీవల వీరిద్దరికి పిల్లలు పుట్టినట్లుగా కూడా ఫ్యాన్స్ ఫొటోస్ను క్రియేట్ చేశారు. దీనిపై కూడా వీరు స్పందించలేదు.
ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) గురించి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుష్క తండ్రి రీసెంట్గా ప్రభాస్‌ను కలిసినట్లు తెలుస్తుంది. ఇది పెళ్లి కోసం మీట్ అయ్యారా..? లేకపోతే ప్రభాస్ హెల్త్ బాగోలేని కారణంగా పరామర్శించడానికి మీట్ అయ్యారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ న్యూస్‌తో పాటు అనుష్క తండ్రి, ప్రభాస్ తన తల్లితో ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది చూసిన నెటిజన్లు ప్రభాస్, అనుష్కల పెళ్లి కోసమే వారు కలిసారని.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతారని ఆశగా ఎదురుచూస్తున్నారు.