»Sushant Singh Rajputs Long Time Girlfriend Rhea Chakraborty Has Reacted To His Death
Rhea Chakraborty: సుశాంత్ సింగ్‌పై రియాచక్రవర్తి స్పందన
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న తన మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తాజాగా పలు విషయాలను వెల్లడించారు.
Sushant Singh Rajput's long-time girlfriend Rhea Chakraborty has reacted to his death.
Rhea Chakraborty: సినిమా ఇండస్ట్రితో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్(Sushant Singh Rajput) మరణంపై తాజాగా రియా చక్రవర్తి(Rhea Chakraborty) స్పందించారు. సుశాంత్ లేకుండా జీవించడం చాలా కష్టమని ఆమె అన్నారు. తనకు ఇష్టమైన స్నేహితురాలిగా ఆయన మరణం తనకు తీరని లోటని పేర్కొన్నారు. తాను మరణించిన బాధ ఒక వైపు ఉండగానే, తనకు నెటిజన్ల నుంచి తన ఫ్యామిలీ నుంచి అనేక ఆరోపణలు ఎదురయ్యాయని, సుశాంత్ మరణించిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ప్రస్తావించారు. ఆ ఘటన తరువాత జరిగిన వరుస సంఘటనలతో ఆ సమయంలో తనకు మనస్పూర్తిగా ఏడ్చేందుకు సమయం కూడా దొరకనీయలేదని ఆమె వెల్లడించారు.
సుశాంత్ మరణించిన బాధ ఓవైపు మీడియాలో తనను నేరస్తురాలిగా చూపిస్తున్న బాధ మరోవైపు అని చెప్పుకొచ్చారు. తన మరణం తర్వాత రియా జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని, ఆ సమయంలో తన కుటుంబం తనకు అండగా నిలబడిందని పేర్కొన్నారు. తన తండ్రి భారత సైన్యంలో పనిచేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలని ధైర్యం చెప్పారని తెలిపారు. మనకు ఇష్టమైన వాళ్లు దూరం అయితే బరించడం కష్టమే కానీ మనమంతా మనుషులం కాబట్టి ముందుకు సాగక తప్పదని రియా చక్రవర్తి వేదాంత ధోరణిలో మాట్లాడారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14, 2020న మరణించాడు. తరువాత సుశాంత్ తల్లిదండ్రులు రియాపై ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఆమె వాట్సాప్ చాట్ల ఆధారంగా ఆమె డ్రగ్స్ కొనుగోళ్లపై సమాంతర విచారణ కూడా ప్రారంభమైంది. NCB రియాపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సెక్షన్ 27-A కింద అభియోగాలు మోపింది. తరువాత ముంబై హై కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా గత మూడు సంవత్సరాలుగా తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొచ్చారు.