»Aditi Rao Hydari And Siddharth Relationship Reacted Haidari
Aditi rao hydari: సిద్ధార్థ్‌తో మళ్లీ దొరికిన అదితి రావు..బర్త్ డేకు ముందే!
మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరీ నేడు 37వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులతోపాటు పలువురు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌తో ఫోటోల విషయంలో ఈ అమ్మడు కీలక వ్యాఖ్యలు చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
aditi rao hydari and siddharth relationship reacted haidari
ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ(AditiRaoHydari) ఈరోజు(అక్టోబర్ 28న) ఈమె తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతోపాటు సన్నిహితులు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. హీరో సిద్ధార్థ్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నప్పటికీ అదితి రావ్ హైదరీ ఎప్పుడు కూడా స్పందించలేదు. అంతేకాదు ఇద్దరూ తరచుగా ఒకరితో ఒకరు తిరుగుతూ పలుమార్లు కనిపిస్తు ఉంటారు. అలాంటి ఒక సందర్భంలో ఈ అమ్మడు కెమెరాకు చిక్కింది. ఆ క్రమంలో సిద్ధార్థ్ తో కలసి పోజులివ్వమని అడిగారు. అప్పుడు ఈ నటి సరదాగా “సాధ్యం కాదు” అని చెప్పింది.
అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే వీళ్లు మాత్రం పుకార్లను పట్టించుకోకుండా షికార్లు చేస్తూనే ఉన్నారు. 2021లో వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన చిత్రం మహా సముద్రం తర్వాత ఒక సంవత్సరం పాటు వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇక తాజాగా హైదరీ బర్త్ డేకు ముందే ఈ పుకార్ల జంట అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్(siddharth) ముంబైలోని బాంద్రాలో కనిపించారు. ఆ క్రమంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరు కూడా ఎంతో చనువుగా కనిపించారు. వీరిని చూస్తే ఒకరికొకరు చాలా ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో కూడా సంగీత దర్శకుడు AR రెహమాన్ కుమార్తె రిసెప్షన్, నటుడు శర్వానంద్ నిశ్చితార్థం, పొన్నియన్ సెల్వన్ 1 ఆడియో లాంచ్ సహా మరికొన్ని సందర్భాలలో కూడా వీరిద్దరు కలిసి కెమెరాకు చిక్కడం విశేషం.