ప్రముఖ నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. కోలీవుడ్ సీనియర్ నటుడు,దర్శకుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు, హీరో ఉమాపతి (Umapathy Ramaiah)తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ వేడుకకు కొద్దిమంది బంధువులు,ప్రముఖులు హాజరయ్యారు. ఉమాపతి రామయ్య, ఐశ్వర్య కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గోవడంతో ఇరుకుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య ప్రేమపడ్డారు.
అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి (Wedding) ప్రతిపాదన చేశారు. అంగీకారం లభించడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా తంబి రామయ్య తమిళ సినిమాలో ప్రముఖ హాస్యనటుడిగా, సహాయ నటుడిగాను చాలా సినిమాల్లో నటించారు.ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా నవంబరు 8న పెళ్లి తేదీని ప్రకటిస్తామని తంబి రామయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమిళం(Tamil), కన్నడలో హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించింది ఐశ్వర్య. ఓ తెలుగు సినిమా ఖరారు కాగా అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అది. మరోవైపు, అర్జున్ కీలక పాత్ర పోషించిన ‘లియో (Leo Movie) థియేటర్లలో సందడి చేస్తోంది. విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమిది.