రియా చక్రవర్తి ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా కాంట్రవర్సీలు గుర్తుకు వస్తాయి. ఎన్నో ఆశలతో సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ, ఆశించిన ఫలితం లభించలేదు. పైగా వివాదాలు చుట్టుముట్టి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.
Rhea Chakraborty: రియా చక్రవర్తి ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా కాంట్రవర్సీలు గుర్తుకు వస్తాయి. ఎన్నో ఆశలతో సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ, ఆశించిన ఫలితం లభించలేదు. పైగా వివాదాలు చుట్టుముట్టి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.
ఇప్పుడిప్పుడే ఆ చేదు అనుభవాల నుంచి బయటపడి, సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. తన ఫోటోలతో కుర్రాళ్ల మదిలో హీట్ పెంచుతోంది.
పదేళ్ల క్రితం తూనీగ తూనీగ చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. రియా అందంగా ఉన్నా, అప్పటికీ నటనలో అంత పరిణితి చెందలేదు. అందుకే ఇక్కడ పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.
దీంతో తన కెరీర్‌ని బాలీవుడ్‌కి షిప్ట్ చేసింది. అక్కడ ఛాన్స్ రావడం మొదలయ్యాయి. కాస్త ఫేమ్ వస్తోంది అనుకునేలోపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేమలో పడింది.
ప్రేమ జీవితం కొంతకాలం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత వారు విడిపోవడం.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ వ్యవహారం బయటపడటం, దానికి రియాను బాధ్యురాలిని చేసి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యవహారాల నుంచి బయటపడింది.
చాలా కాలం కనీసం బయటకు కూడా రాకుండా ఉండిపోయిన రియా, మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది.
అభిమానులకు దగ్గరై, ఆ తర్వాత మళ్లీ అవకాశాలు చేజిక్కించుకోవాలని అనుకుంటోంది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టింది.
కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసింది. ఆ ఫోటోల్లో స్టైలిష్‌గా కనపడుతోంది. మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.