»The Motion Poster Of Antam Kadidi Arambam Is Released
Movie : ‘అంతం కాదిది ఆరంభం’ మోషన్ పోస్టర్ విడుదల
నూతన దర్శకుడు ఇషాన్(Director Ishan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’(Antham Kaadidi Arambham Movie). పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ (Motion Poster)ని ప్రముఖ దర్శకుడు దశరధ్(Director Dasharath) విడుదల చేశారు.
క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నూతన దర్శకుడు ఇషాన్(Director Ishan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’(Antham Kaadidi Arambham Movie). పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రభు పౌల్రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ (Motion Poster)ని ప్రముఖ దర్శకుడు దశరధ్(Director Dasharath) విడుదల చేశారు. దశరథ్ మాట్లాడుతూ..తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిపారు.
అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ల నగ్న వీడియోల(Videos)ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారనేదే ఈ సినిమా కథాంశమని దశరథ్(Director Dasharath) తెలిపారు. నిర్మాత సిరాజ్(Producer Siraj) మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మీద అభిమానంతో తమ సినిమాకి ఈ టైటిల్ పెట్టినట్లు తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశామన్నారు. మహిళల, యువతులపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఈ చిత్రం ఓ మేసేజ్ ఇస్తుందన్నారు. హీరో కమ్ దర్శకుడు ఇషాన్ (Hero, Director Ishan) చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలిపారు.
త్వరలోనే అంతం కాదిది ఆరంభం సినిమా(Antham Kaadidi Arambham Movie)కు సంబంధించిన అప్డేట్లను తెలియజేస్తామన్నారు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, హీరోయిన్లు శక్తి మహీంద్రా, నిష్మా, షేర్ స్టూడియో అధినేత దేవీ ప్రసాద్, గీతా సింగ్, ఖాదర్ గౌరీ, వైష్ణవి, నాగ మధు తదితరులు ఈవెంట్లో పాల్గొన్నారు.