The Kashmir Files: మొరుగుతాయ్ అంటూ ప్రకాష్ రాజ్ కు కౌంటర్
ది కాశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్, దీనిని చూసేవారు ఇడియట్స్ అంటూ ఈ సినిమా పైన తన అక్కసు వెళ్లగక్కిన సినిమా విలన్ ప్రకాష్ రాజ్ కు ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ది కాశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్, దీనిని చూసేవారు ఇడియట్స్ అంటూ ఈ సినిమా పైన తన అక్కసు వెళ్లగక్కిన సినిమా విలన్ ప్రకాష్ రాజ్ కు ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. తన సినిమా విడుదల అయి ఏడాది దాటినప్పటికీ దీని పైన అర్బన్ నక్సలైట్లను ఆక్రోశం పోవడం లేదని, వారికి తన సినిమా నిద్రలేని రాత్రులను ఇప్పటికీ మిగుల్చుతోందని ఎద్దేవా చేశారు. కుక్కలు మొరుగుతుంటాయి వాటిని మనం పట్టించుకోకుడదని అంతే ధీటుగా స్పందించారు.
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) పైన నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఇటీవల విషం కక్కిన్ విషయం తెలిసిందే. అదో చెత్త సినిమా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఆ చిత్ర దర్శకుడికి కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవా చేశాడు. కేరళలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివెల్ ఆఫ్ లేటర్స్ ఇన్ కేరళ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాడు ఈ సినీ విలన్. ది కశ్మీరి ఫైల్స్ సినిమాను ఎందుకు నిర్మించారో తమకు తెలుసునని, అదో చెత్త సినిమా అన్నాడు. ఆ సినిమా నిర్మాణం సిగ్గులేనితనమని తన ఆక్రోషాన్ని వెళ్లగక్కాడు. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసిందంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. ఆ సినిమా దర్శకుడు ఇప్పటికీ తనకు ఆస్కార్ ఎందుకు రాలేదని మాట్లాడుతున్నాడని, అతనికి కనీసం భాస్కర్ కూడా రాదన్నాడు. ఇదో ప్రోపగండా సినిమా అన్నాడు. ఇలాంటి ప్రచార సినిమాలు తీసేందుకు కొంతమంది రూ.2000 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నట్లు తనకు తెలిసి వాళ్లు చెప్పారన్నాడు. అదే సమయంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాను ప్రశంసించడం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని అంటున్నారు.
వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022 ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. కథ కూడా వివేక్‌దే. జీ స్టూడియో దీనిని నిర్మించింది. 1990లలో కాశ్మీర్ పండిట్స్ పైన జరిగిన అఘాయిత్యాలను ఇందులో కళ్లకు కట్టారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. జీస్టూడియోస్‌తో కలిసి పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దీనిని తెరకెక్కించారు.
దేశ విభజన తర్వాత కాశ్మీర్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాశ్మీర్ ను ఆక్రమించుకోడానికి పాకిస్థాన్ చాలా ప్రయత్నాలు చేసింది. భారత స్వాతంత్రానికి ముందు కాశ్మీర్ ఒక అందమైన ప్రదేశం… హిందువులకు, పండిట్లకు స్వర్గంలా ఉండేది. స్వాతంత్రం అనంతరం నాయకుల స్వార్థం వల్ల, ఉగ్రవాదుల వల్ల, పాకిస్థాన్ వల్ల కాశ్మీర్ స్వరూపం మారిపోయింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కథ 1980-90లలో కాశ్మీర్ పండిట్స్ పైన సాగిన సాముహిక హత్యాకాండని తెలుపుతుంది. కాశ్మీర్ లోని హిందువులు, ముఖ్యంగా పండిట్స్ పైన పాకిస్తాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండకు కళ్లకు కట్టారు. కాశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు.. ఆడవారిని మానభంగాలు చేసారు.. చిన్న పిల్లలనే కనికరం లేకుండా హతమార్చారు. కాశ్మీర్ ని పండిట్స్ స్మశానంగా మార్చారు. కాశ్మీర్ లో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు. ఈ మరణకాండలో లక్షలమంది హిందువులు మృత్యు ఒడిలోకి జారిపోయారు. దాదాపు 5 లక్షల మంది కాశ్మీరీ పండిట్స్ కాశ్మీర్‌ను వదిలి పారిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం చరిత్రను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.