ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఒకే ఒక్క టీజర్.. ఆ సినిమా రిజల్ట్‌ను కాస్త ముందే డిసైడ్ చేసేస్తోంది. టీజర్ చూసిన తర్వాత సినిమా చూడాలా వద్దా.. అనేది డిసైడ్ అవుతున్నారు నెటిజన్స్. టీజర్, ట్రైలర్ అదరహో అనేలా ఉంటే.. సదరు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇక టీజర్ ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆ సినిమాలను పోస్ట్ పోన్ చేయడమే కాదు.. అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రీసెంట్గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ విషయంలో ఇదే జరిగింది. ఆదిపురుష్ టీజర్ జనాలకు ఏ మాత్రం నచ్చలేదు. ప్రభాస్‌ను పెట్టుకొని యానిమేటేడ్ సినిమా చేస్తున్నారని.. మేకర్స్ పై మండి పడ్డారు నెటిజన్స్. అయితే ఆదిపురుష్ లాగే వస్తున్న మరో మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ మాత్రం.. టీజర్‌తోనే అట్రాక్ట్ చేసిందని అంటున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ‘హనుమాన్’ అనే.. సూపర్ హీరో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో.. మంచి రెస్పాన్స్ వస్తోంది. విజువల్స్ పరంగా అదరహో అనేలా ఉందంటున్నారు నెటిజన్స్. ఒక్క గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు టీజర్ కట్ బాగుందని అంటున్నారు. దాంతో సినిమాపై అంచనాలను పెంచేసింది ఈ టీజర్. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలకపాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.