కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు.. టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని తెలుగు ఆడియెన్స్ గట్టిగా నమ్మతుంటారు. అందుకే తమిళ్‌తో పాటు తెలుగులోను సూర్య సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్య అప్ కమింగ్ ఫిల్మ్‌కు భారీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది.
ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఓటిటిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. ఈ ఏడాది వచ్చిన ‘ఈటీ’ మూవీతో థియేటర్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కానీ విక్రమ్ సినిమాలో రోలెక్స్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. అలాగే ఇటీవలె దర్శకుడు శివతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. ఇది సూర్య కెరీర్లో 42వ ప్రాజెక్ట్ కానుంది. యువీ క్రియేషన్స్ మరియు తమిళ నిర్మాణ సంస్థ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లు కలిసి.. ఈ భారీ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం ఒక మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. కానీ అప్పుడే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం.. ఏకంగా 100 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అన్ని భాషల్లో కలిపి ఈ డీల్ జరిగినట్టు కోలీవుడ్ టాక్. దాంతో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం.. గతంలో ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు.. సూర్యకు ఓటిటిలో కలిసి రావడమేనని చెప్పొచ్చు. మరి థియేటర్లో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.