Actor Surya : బంపర్ ఆఫర్.. సూర్యతో నటించే ఛాన్స్ కొట్టేయండి!
Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియెన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు ఆడియెన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అసలు సూర్య నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే.. ఏదో కొత్తదనం ఉన్నట్టే. అందుకే సూర్య అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే సినిమాల్లో నటించాలనుకునే వారికి సూర్యతో ఛాన్స్ వస్తే.. గాల్లో తేలిపోతారు. ఇప్పుడు అలాంటి అవకాశమే ఇస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సూర్య తన కెరీర్లో 42వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. సూర్య కెరీర్లోనే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సూర్య 42 క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 25 నుంచి 55 ఏళ్ల మధ్యలో.. మంచి బాడీ బిల్డింగ్ ఉండి, మంచి గడ్డం, లాంగ్ హెయిర్ కలిగి ఉన్న మగవారికి ఈ ఛాన్స్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తమ మెయిల్ ఐడీకి ఫోటోగ్రాఫ్‌లను పంపాలని ప్రకటించారు స్టూడియో గ్రీన్ సంస్థ వారు. మెయిల్ ఐడీ డీటెల్స్ కావాలంటే.. స్టూడియో గ్రీన్ ట్విట్టర్ హ్యాండిల్లో చూడొచ్చు. అయితే ఈ క్యాస్టింగ్ కాల్ చూసిన తర్వాత.. సూర్య 42లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి సూర్యతో కలిసి యుద్ధం చేయాలంటే.. వెంటనే ఈ బంఫర్ ఆఫర్‌ను పట్టేయండి. ఇకపోతే.. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నార