»Tamil Actor Bonda Mani Death Due To Kidney Failure
Bonda mani: కిడ్నీ వ్యాధితో ప్రముఖ హాస్యనటుడు బోండా మణి మృతి
ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో మృత్యువాత చెందారు. ఈ నటుడు పలు తమిళ చిత్రాల్లో నటించారు. నటుడు వడివేలుతో ఆయన చేసిన కామెడీలు బాగా ప్రాచుర్యం పొందాయి.
tamil actor bonda mani death due to kidney failure
ప్రముఖ హాస్యనటుడు బోండా మణి(60) కిడ్నీ సంబంధిత వ్యాధితో డిసెంబర్ 23న మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ రాత్రి చెన్నైలోని పోజిచలూరులోని తన నివాసంలో స్పృహతప్పి పడిపోయిన మణిని వెంటనే క్రోంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కరోనా తర్వాత ఈ హాస్యనటుడు బోండా మణి ఆర్థికంగా చితికిపోయారు. ఆయనకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. కామెడీ పాత్రలు ఏవీ పెద్దగా రాలేదు. సినిమాలే కాకుండా కొన్ని స్మాల్ స్క్రీన్ సీరియల్స్ లో కూడా నటించాడు. చెన్నై(chennai)లోని బొజిచలూర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. అయితే ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయిన బోండా మణిని క్రోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అతనికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంది. అది తీవ్రమై కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసిందని అంటున్నారు. ఒక కిడ్నీ ప్రభావితమైతే, మరో కిడ్నీ కూడా చెడిపోతోంది. దీంతో ఆయన నిరంతరం చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి తన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడని చెబుతున్నారు. ఇది సహజ మరణమని వైద్యులు తెలిపారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుంధర ట్రావెల్స్, మరుదామలై, విన్నర్, వేలాయుతం, జిల్లా సహా 150కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా నటుడు వడివేలుతో ఆమె నటించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.