ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌తో నటించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అమ్మడి ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే ఉంది. తాజాగా డంకీ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన తాప్సీ.. తనను ఓ అబ్బాయి దూరం పెట్టాడని చెప్పి షాక్ ఇచ్చింది.
టాలీవుడ్‌ను కంప్లీట్‌గా వదిలేసిన తాప్సీ.. బాలీవుడ్లో లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది తాప్సీ. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీకి మంచి క్రేజ్ ఉంది. కానీ ఈ మధ్య తాప్సీ ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచేసింది. వర్కౌట్ల వీడియోలతో రచ్చ చేస్తూ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. ఆ మధ్య ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చి ఔరా అనిపించింది. బికినీ, ఎద అందాలు, నడుమును చూపిస్తూ టెంప్ట్ చేస్తునే ఉంది. అలాగే వరుస సినిమాలు చేస్తు ఉంది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన డంకీ సినిమా థియేటర్లో రన్ అవుతోంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే సలార్ సినిమా రిలీజ్ అవడంతో.. డంకీ కష్టమనే టాక్ నడుస్తోంది. కానీ నార్త్‌లో మాత్రం డంకీ పర్లేదు అనిపించుకుంటోంది. డిసెంబర్ 21న డంకీ రిలీజ్ అయింది. ఈ క్రమంలో డంకీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో.. తన లవ్, బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది తాప్సీ. ఇలాంటి బ్యూటీని ఎవరు రిజెక్ట్ చేస్తారు? అనుకుంటే.. తనను ఓ అబ్బాయి దూరం పెట్టాడని చెప్పి షాక్ ఇచ్చింది. తాను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ప్రేమలో పడిందట.
తన సీనియర్, 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయిని ఇష్టపడిందట. మొదట్లో ఆ అబ్బాయి కూడా తాప్సీని పై ఇంట్రెస్ట్ చూపించాడట. కానీ స్టడీస్ కారణంగా.. అతను తాప్సీని దూరం పెట్టాడట. అంతేకాదు.. ఇలాంటివి వదిలేసి స్టడీపై ఫోకస్ చేయమని ఉచిత సలహా కూడా ఇచ్చాడట. దీంతో.. తాను ఇష్టపడ్డ అబ్బాయి అలా అనడంతో.. చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది తాప్సీ. ఆ బ్రేక్ స్టోరీ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని సెలవిచ్చింది. అయినా తాప్సీ అప్పుడు హీరోయిన్ కాదు కాబట్టి.. రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు తాప్సీ లవ్ చేస్తే వదులుకుంటారా? ఏంటి?