ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా సలార్ పార్ట్ వన్ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో సలార్ సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేశాడు నీల్.
బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని మిస్ యూజ్ చేసినట్టుగా ప్రశాంత్ నీల్ చేయలేదు. ప్రభాస్ కటౌట్‌ను ఎలా వాడుకోవాలో.. అంత పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎట్టకేలకు డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ భారీ ఎత్తున ఆడియెన్స్ ముందుకొచ్చింది. మిడ్ నైట్ ఒంటి గంట నుంచే సలార్ షోస్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ షో నుంచే సలార్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా ఈ రేంజులో ప్రభాస్‌ను ప్రెజెంట్ చేయలేదు. బాహుబలి తర్వాత వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్.. సలార్‌తో సాలిడ్ బౌన్స్ అయ్యాడు.
ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ పేరుతో థియేటర్లోకి వచ్చింది. అయితే పార్ట్2 కోసం పార్ట్ 1 ఎండింగ్ మిస్ అవ్వకండి అని.. ఇంటర్య్వూల్లో చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. అందుకు తగ్గట్లుగానే క్లైమాక్స్‌లో పార్ట్ టైటిల్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఈ సీక్వెల్లో దేవారథ, వరదరాజ మన్నార్ మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది? ఖాన్సార్ కుర్చీలో ఎవరు కూర్చుకుంటారు? అనే పాయింట్లో శౌర్యాంగ పర్వం సినిమా ఉండే ఛాన్స్ ఉంది.
అయితే.. సెకండ్ పార్ట్ ఎప్పుడుంటుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల్లో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సలార్ ప్రమోషన్స్ ఇంటర్య్వూలో సలార్ 2 ఎప్పుడుంటుందో చెప్పలేనని చెప్పాడు ప్రశాంత్ నీల్. అయితే.. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు నీల్. కాబట్టి.. ఎన్టీఆర్ సినిమా తర్వాత సలార్ ఉంటుందా? లేదంటే ముందే ఉంటుందా? అనేది చూడాలి.