NLR: అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఐసీడీఎస్, సీడీపీవోలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కి వివరించారు.