»Star Hero Who Dont Know How To Use Phone Pe Account
Nani: పేరుకు పాన్ ఇండియా హీరో.. ఫోన్ పే చేయడం కూడా రాదు
ఇప్పటి జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊయలలో ఊగుతున్న చిన్నారి కూడా ఫోన్లో(Phone) ఎ టు జెడ్ ఆపరేట్ చేస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లల ఫోన్లో యాప్స్(APPs in phone) ఉంటాయి.
Nani: ఇప్పటి జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊయలలో ఊగుతున్న చిన్నారి కూడా ఫోన్లో(Phone) ఎ టు జెడ్ ఆపరేట్ చేస్తున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లల ఫోన్లో యాప్స్(APPs in phone) ఉంటాయి. అయితే పాన్ ఇండియా(Pan india) హీరోగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్(Tollywood Star) హీరోకు మాత్రం ఇప్పటి వరకు ఫోన్ పే(Phone Pe) కూడా చేయలేకపోతున్నాడన్న వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా వ్యాప్తి చెందుతోంది.
ఆయన మరెవరో కాదు ఇటీవల దసరా(Dasara) సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న నేచురల్ స్టార్ నాని(Nani). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. దసరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని మాట్లాడుతూ.. “ఫోన్ పే ఎలా వాడాలో తనకు తెలియదని.. నిజంగా ఫోన్ ఎంత అవసరమో అంత మాత్రమే ఉపయోగిస్తానని చెప్పాడు”. అంతేకాదు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారంలో తనకు నాలెడ్జి శూన్యమని తెలిపారు.
ఆయనకు డిజిటల్ లావాదేవీలు అన్నీ తెలుసు. అదంతా తమ టీమ్ చూసుకుంటుంది. మరి ముఖ్యంగా అంజన లేకుండా నాని ఫుడ్ ఆర్డర్ కూడా చేయలేడు. ఫుడ్ ఆర్డర్ ఎలా చేయాలన్నది కూడా తనకు తెలియదన్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని తన సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో ఫోన్ పే, గూగుల్ పే ఎలా వాడాలో తెలియదా అని మండిపడుతున్నారు.