Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కొన్నిరోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తన కూతురు రాహాతో కలిసి ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రణ్‌బీర్ తెలిపారు. యానిమల్ సినిమా తర్వాత ఏ చిత్రానికి కూడా సైన్ చేయలేదు. నా కూతురితో కొన్నిరోజులు సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాహా పుట్టిన తర్వాత తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు ఒక ఆరునెలలు లాంగ్ బ్రేక్ తీసుకుని తనతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్న అని రణ్‌బీర్ వెల్లడించారు. ఇప్పుడిప్పుడే రాహా ఇళ్లంతా తిరుగుతూ అన్నింటిని గుర్తిస్తోంది. తన ప్రేమను తెలుపుతోంది. అమ్మ, నాన్న వంటి పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోంది. తండ్రిగా అందమైన క్షణాలను ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఈ ఆరునెలలు పూర్తిగా తనతోనే గడుపుతానని రణ్‌బీర్ చెప్పారు. గతేడాది రణ్‌బీర్, ఆలియా భట్‌కు పాప పుట్టిన సంగతి తెలిసిందే.
రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సందీప్ వంగా దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన రష్మిక నటిస్తోంది. అనీల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. భారీ బడ్డెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలామంది ఈ చిత్రం విడుదల గురించి ఎదురుచూస్తున్నారు.