»Jailer Movie Villain Vinayakan Arrested In Kerala Ernakulam
Vinayakan arrested: జైలర్ విలన్ అరెస్ట్
జైలర్ చిత్రంతో తెలుగుప్రేక్షకులకు దగ్గరైన నటుడు వినాయకన్. మద్యం మత్తులో పోలీసులతో గొడవకు దిగాడు. ఎంత చెప్పిన వినకపోవడంతో అతడిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
Jailer movie villain Vinayakan arrested in Kerala Ernakulam
Vinayakan arrested: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన జైలర్(Jailer) చిత్రంలో విలన్‌గా నటించిన వినాయకన్ (Vinayakan) ఇప్పుడు దేశమంతా తెలుసు. ఆయన చేసిన వర్మ పాత్రకు ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళం టౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం మత్తులో గొడవకు దిగడంతో మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. తను నివసిస్తున్న అపార్ట్మెంట్ వాసులు ఆయనపై ఫిర్యాదు చేశారు. వినాయకన్ వలన ఇబ్బంది పడుతున్నట్లు పక్క ఫ్లాట్ వాళ్లు చెప్పడంతో ఎర్నాకుళం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వినాయకన్ పోలీసులతో గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తరువాత మెడికల్ టెస్ట్ కోసం ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినాయకన్‌ను అరెస్ట్ చేయడం కొత్తేమి కాదు. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలర్ సినిమా విడుదలైన సమయంలో దానికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.