హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యమన్నట్టు.. కొందరు ముద్దుగుమ్మలకు వరుస ఆఫర్లు క్యూ కడుతుంటాయి. ప్రస్తుతం యంగ్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి కూడా అలాగే ఉంది. అదృష్టం అంటే అమ్మడిదే అంటున్నారు. ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటివరకు తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది..పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్‌ను తెగ అట్రాక్ట్ చేసింది.
దాంతో తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, నితిన్ 32, వైష్ణవ్‌తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టేనని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 వర్కింగ్ టైటిల్‌తో మహేష్ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్‌కు కూడా స్కోప్ ఉందని..
దానికోసం శ్రీలీలను ఫిక్స్ చేశారని చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. మధ్యలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించినా.. తాజాగా శ్రీలీలనే సెకండ్ హీరోయిన్గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బన్నీ సరసన కూడా ఛాన్స్ అందుకుందట ఈ చిన్నది. ఓ యాడ్ కోసం అల్లు అర్జున్‌తో కలిసి నటించిందట.
ఆ యాడ్ ఫిల్మ్‌కు త్రివిక్రమ్‌నే దర్శకత్వం వహించాడట. దాంతో ఎస్ఎస్ఎంబీ 28లో శ్రీలీల ఫిక్స్ అయిపోయిందనే చెప్పొచ్చు. త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఏదేమైనా.. ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్లో ఉందని చెప్పొచ్చు.