»Sitara Entertainments Entry Into Distribution With Leo
Sitara Entertainments: ‘లియో’తో పంపిణీ రంగంలోకి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఎంట్రీ
ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతోంది. లియో సినిమాతో ఇతర ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) సరికొత్త అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతూ దూసుకుపోతోంది. ఇతర భాషల్లోని స్టార్ హీరోలతో కూడా వరుస సినిమాలు చేస్తోంది. ఆ మధ్యనే ధనుష్‌తో ‘సార్’ (వాతి) సినిమా తీసి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో లియో సినిమాను రూపొందిస్తోంది.
లియో చిత్రంలో దళపతి విజయ్, త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిక్ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి ప్రముఖ దర్శకులు కూడా నటిస్తుండటం విశేషం. దాదాపు 125 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరిగింది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రంపై తమిళ, తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2023 అక్టోబర్ 19న విడుదల కానుంది.
‘మాస్టర్’ మూవీని తెరకెక్కించిన ఎస్.ఎస్.లలిత్ కుమార్ ‘లియో’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. మాస్టర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన జగదీష్ పళనిసామి ఈ యాక్షన్ బొనాంజాకు కూడా సహ నిర్మాతగా ఉన్నారు. కాగా లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) ఎంట్రీ ఇస్తోంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న సినిమా మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు సితార సంస్థ వెల్లడించింది.