పాప్ సింగర్ హెసూ (Pop Singer Haesoo) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కొరియన్ పాప్ సింగర్‌గా ఎదిగిన హెసూ ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.
పాప్ సింగర్ హెసూ (Pop Singer Haesoo) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కొరియన్ పాప్ సింగర్‌గా ఎదిగిన హెసూ ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. కొరియన్ మ్యూజిక్ (Music)లోని ట్రాట్ అనే విభాగంలో సింగర్ (Singer)గా హెసూ ఉన్నారు. ఆమె బలవన్మరణంతో ముందుగా ప్రకటించిన ఈవెంట్‌కు హాజరుకావడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
హెసూ చిన్న వయసులోనే ఆత్మహత్య(Suicide) ఎందుకు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. హోటల్ రూంలో సూసైడ్ నోట్ (Suicide Note) లభించడంతో దర్యాప్తులో ఇతర వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. 1993లో జన్మించిన హెసూ 2019లో మై లైఫ్, మి అనే సింగిల్ ఆల్బంతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు.
గయో స్టేజ్, హ్యాంగవుట్ విత్ యూ, ది ట్రాట్ షో వంటి షోలు, ఆల్బమ్స్‌తో ఆమెకు మంచి పేరు లభించింది. హెసూ(Pop Singer Haesoo) తాను చనిపోయే ముందు రోజు కూడా సోషల్ మీడియాలో ఎంతో ఆనందంగా కనిపించారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె ప్రతిరోజూ తన ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలు పంచుకునేవారు. యువ పాప్ స్టార్(Pop Star) మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.